3, జులై 2017, సోమవారం

మానవత్వమే నీ ఊపిరి


                                 మానవత్వమే నీ ఊపిరి

ఓ మనిషీ !
నీ జన్మ నీకొక వరం
అనుభవించు అర్ధవంతంగా
అసూయ మొక్కను
మదిలో కలుపులా పెరికేస్తూ
నీ తోటివారికి
స్నేహపరిమళాలు పంచు
కష్టంలో ఉన్న నేస్తానికి
సహాయహస్తాన్ని అందివ్వు
మంచితనపు వెలుగులో
ఆదర్శపు బాటలో
నిజాయితీ లక్ష్యంగా
మానవత్వమే ఊపిరిగా
నిరంతరం సాగిపో

ఉద్యోగక్రాంతి - మే ,2017 

25, ఫిబ్రవరి 2017, శనివారం

నానీలు


మబ్బూ !మబ్బూ !
నీ పరుగెక్కడికి ?
ప్రేయసి 
పాదాభిషేకానికి 

           * 
చెట్టుకున్న విశ్వాసం 
మనిషికి లేదే 
ఉంటే వృద్ధాశ్రమాలు 
ఎందుకు ?

             *
పెదాలు 
పురిటినొప్పులు
ముత్యాల్లాంటి మాటలు 
పసిబిడ్డల్లా 

               *
కళ్ళవాకిళ్లు 
జ్ఞానసముద్రం 
ఒకదాని వెంట ఒకటి 
తోడుగా .. నీడగా

               *
మనసు దేవత 
పెన్ను పూజారి 
కరుణిస్తే 
కమ్మటి కావ్యమే !