26, ఏప్రిల్ 2016, మంగళవారం
23, ఏప్రిల్ 2016, శనివారం
21, ఏప్రిల్ 2016, గురువారం
19, ఏప్రిల్ 2016, మంగళవారం
16, ఏప్రిల్ 2016, శనివారం
13, ఏప్రిల్ 2016, బుధవారం
12, ఏప్రిల్ 2016, మంగళవారం
ఉగాదికి స్వాగతం
విహంగ లో నా కవిత ...
ఉగాదికి స్వాగతం !
కొత్త సంవత్సరం
కోరికల విహంగాలను విప్పుకుంటూ
ఉగాదిగా ప్రత్యక్షమయ్యే తరుణం
ఆహ్వానిద్దాం ఆనందంగా
నీ నా బేధాలను మరిచి
నిలబడదాం సంతోషంగా
స్వార్ధాన్ని విడిచి
అందరం ఒకటే అని నినదిద్దాం
విరబూసిన వేపపూతలా
స్వచ్చంగా పలకరించుకుందాం
షడ్రుచుల సమ్మేళనం జీవితం
పంచుకుందాం తోటివారితో కలిసి మెలిసి
విభేదాలను ప్రక్కన పెట్టి
మానవత్వం తోడుగా పయనిద్దాం
చేయీ చేయీ కలిపి
నూతన సంవత్సరానికి
స్వాగతం పలుకుదాం !
11, ఏప్రిల్ 2016, సోమవారం
7, ఏప్రిల్ 2016, గురువారం
6, ఏప్రిల్ 2016, బుధవారం
బయో డేటా
బయో డేటా
పేరు : యలమర్తి అనూరాధ
విద్యార్హత : బి.యస్సీ.హోం సైన్స్
ఫుట్టిన గ్రామము : ముదునూరు (క్రిష్ణా జిల్లా)
పుట్టిన తేది : 11-10-1959
స్వగ్రామము : కైకలూరు (క్రిష్ణా జిల్లా)
తండ్రి : లక్కింశెట్టి శ్యామల క్రిష్ణ మోహన రావు
తల్లి : లక్కింశెట్టి శీతారావమ్మ
సాహిత్యపు వయసు : 40 సంవత్సరాలు
చదువు : 6-10జిల్లా పరిషత్ బాలికల హైస్కూలు,శ్రీకాళహస్తి
తొలి ప్రచురణ : 1978 ఆంధ్ర పత్రిక (దిన) రాధిక, కవిత
ఆకాశవాణి(AIR) : 1980 నుంచి ఇప్పటివరకు - కథ, కవిత, వ్యాసాలు,నాటికలు, టాస్క్ ల రూపాలలో..
దూరదర్శన్ : మహిళా కవి సమ్మేళనం (అమ్మ మనసు)
బుల్లి తెర : ఈ టి వి టు 'సఖీ’ లో ఎనిమిది ప్రోగ్రాంస్
అవార్డ్స్ : 50 కి పైగా
1.రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉత్తమ సాహితీవేత్త అవార్డు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి చేతుల మీదుగా
2. డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పై సందర్భంగా అభినందన సభ
3. గుర్రం జాషువా అవార్డు- డాక్టర్ అంబేద్కర్ యువజన సాంస్క్రతిక సమాఖ్య, విజయవాడ
4. సోమేశ్వర సాహితీ అవార్డు--సాహిత్య సేవా సమితి ట్ర స్ట్, విశాఖపట్నం
5. కళ్యాణ సాహితీ అవార్డు,విజయవాడ
6. నిధి అవార్డు, దేవి ఫౌండేషన్,విజయవాడ
7. లక్కోజు దుర్గాచార్యుల వారి అవార్డు,విజయవాడ
8. బూర్గుల రామక్రిష్ణారావు గారి అవార్డు, హైదరాబాదు
9. సావిత్రి అవార్డు,కొత్తపేట
10.వేలూరి పాణిగ్రాహి అవార్డు,విజయవాడ,
11.కొనకళ్ళ వెంకటరత్నం అవార్డు,ఏలూరు
12. సోమేపల్లి అవార్డు,నర్సాపురం
పురస్కారాలు :
1. కృష్ణా జిల్లా, జిల్లా సాంస్కృతిక మండలి, మచిలీపట్నం--ప్రభుత్వ పురస్కారం ఉగాది నాడు---2సార్లు
2. జిల్లా సాంస్కృతిక మండలి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఉగాది పురస్కారం--2సార్లు
3.మాడుగుల నాగ ఫణిశర్మ గారితో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షెత్రం లో తెలుగు పండుగ సందర్భంగా కవి పురస్కారం
4.కృష్ణ మహోత్సవం, విజయవాడ -- ప్రముఖ మహిళా రచయిత్రులు - పాటిబండ్ల రజని, నిర్మల తదితరులతో మహిళా కవి సమ్మేళనం, సత్కారం
5. అభ్యుదయ వేదిక, నాగాయలంక--ఉగాది పురస్కారం
6. దేవీ, విజయవాడ --ఉగాది పురస్కారం
7. విజ్ఞాన వేదిక, ఉండి -- ఉగాది పురస్కా రం
8. విజ్ఞాన వేదిక, భీమవరం -- ఉగాది పురస్కారం
10. యస్.వి.కె.పి. కాలేజ్. పెనుగొండ వారి ద్వారా`గౌరవ అతిథి’గా పురస్కారం --'మహిళా దినోత్సవం' సందర్భంగా
11. తణుకు--కళాంజలి వారిచే రచయిత్రి పురస్కారం
12. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంథాలయం,తణుకు వారిచే రచయిత్రి పురస్కారం
13. వైశ్యా బ్యాంకు ,విజయవాడ వారిచే ఉగాది పురస్కారం
14. అభ్యుదయ రచయితల సంఘం ,జంగారెడ్డిగూడెం వారిచే ఉగాది పురష్కారం
15. భారత్ వికాస్ పరిషత్ ,విజయవాడ వారితో ఉగాది పురష్కారం
16. అభ్యుదయ రచయితల సంఘం,తణుకు వారితో ఉగాది పురష్కారం
17.ఇన్నర్వీల్ క్లబ్ వారితో మహిళాదినోత్సవం సందర్భంగా పురష్కారం
18.నన్నయ్య భట్టారకఫీఠం,తణుకు వారితో ఉగాది పురష్కారం
19.ఎక్స్ రే పురష్కారం,విజయవాడ
20. వాసవీ క్లబ్ ,భవానీపురం వారితో రచయిత్రిగా పురష్కారం మొదలైనవి
సభా కార్యక్రమాలు : ముఖ్య అతిథిగా:
1. శ్రీ మొగుళ్ళూరి వెంకట పేరయ్యగారి అభినందన సత్కార సభ --శ్రీ తేలప్రోలు రాజా హైస్కూలు పూర్వవిద్యార్థి సంఘం, విజయవాడ.
2. శ్రీ వాసవి క్లబ్, భవాని పురం, విజయవాడ
3. బ్రౌనింగ్ జూనియర్ కాలేజ్,తెలుగు పండుగ, భీమవరం.
4. జిల్లా గ్రంధాలయం ,తణుకు
5.చైతన్య స్కూల్ వార్షికోత్సవం,తణుకు
ప్రధానవక్తగా:
1. సాహితీమిత్రులు, కైకలూరు, 2002 ఉగాది
2.ఇన్నర్ వీల్ క్లబ్, పెనుగొండ,మహిళాదినోత్సవం
3.సాహితి సంస్థ ,తణుకు
4. జిల్లా గ్రంథాలయం,తణుకు
5. బ్రౌనింగ్ జూనియర్ కాలేజీ ,భీమవరం
కవి సమ్మేళనాలు, నిర్వహణ:
1. హనుమంతరాయ గ్రంథాలయం, విజయవాడ, 1994.
2. బెజవాడ యువకలాలు, 2002.
పాల్గొనటం :
100కి పైగా
ఆహ్వానం:
1. తానా అమెరికా వారు, స్పెషల్ గెస్ట్.
2. లక్నో జాతీయ కవి సమ్మేళనం , ప్రభుత్వ యువజన శాఖ.
3. ప్రపంచమహా సభలు . గెస్ట్ గా .. తిరుపతి
పత్రికా ప్రచురణలు:
1. కథలు (150 కి పైగా}
2. కవితలు (325 కి పైగా)
3. వ్యాసాలు (325 కి పైగా)
ప్రచురింపబడిన పత్రికలు:
ఆంధ్ర భూమి, దిన, వార, మాస పత్రికలు, స్వాతి, ఆంధ్ర జ్యోతి,వనితా జ్యోతి, సుమన, అంజలి, వార్త, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక,నేటి నిజం, త్రికాలాలు, విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్, భావ తరంగిణి, రచన,కధాకేళి,ప్రహేళిక, విజ్ఞాన సుధ, గ్రంథాలయ సర్వస్వం, మల్లెతీగ,రమ్యభారతి ,హెల్త్ -హెల్ప్ స్వర్ణాంధ్ర, సువర్ణలేఖ,భక్తిసుధ,,వండర్ వరల్డ్, ధ్యానమాలిక,చతుర, నవ్య, ప్రజా డైరీ, నెలవంక- నెమలీక,సాహితీకిరణం మొదలైనవి
నిర్వహించిన శీర్షికలు :
1. మనస్విని- వనితాజ్యోతి[ సైకియాట్రిక్ స్టోరీస్]--15నెలలు
2. నేస్తం, వార్త, చెలి -- 19 వారాలు
3. సంసారంలో సరిగమలు--వండర్ వరల్డ్ --10 సం,,లు
4. కవితాసుమాలు--స్వర్ణాంధ్ర--50 కవితలు
5. వ్యాసావళి -- స్వర్ణాంధ్ర -- 116 వ్యాసాలు
6. జీవన జ్యోతి -హెల్త్ హెల్ప్ పత్రిక -- 12 నెలలు
7. ఆలోచిద్దాం -- ఆంధ్ర ప్రదేశ్ -- 3 నెలలు
8. మేలుకో, తరుణి, ప్రజా డైరీ, బళ్ళారి, (కర్ణాటక),
నిర్వహిస్తున్న శీర్షికలు :
కొత్త బంగారు లోకం, వండర్ వరల్డ్--విజయవాడ
పుస్తక ప్రచురణలు :
1. వెజిటేరియన్ వంటకాలు -- విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ
2. చిట్కాల పుస్తకం, ఋషి పబ్లికేషన్స్, విజయవాడ
3. సంసారంలో సరిగమలు, గొల్లపూడి, రాజమండ్రి
4. ప్రేమ వసంతం, నవల
వండర్ వరల్ద్ అనుబంధ పుస్తకాలు :
1. మీ పిల్లలు సూపర్ కిడ్స్ లా కీర్తింపబడాలంటే
2. ఇల్లాలు తలుచుకుంటే ఇల్లంతా స్వర్గధామమే
3. బేబీ కేర్ టిప్స్
4. డెకరేషన్
5. నిరుద్యోగ యువతకు దోసె క్యాంప్
6. సర్దుకుపోండి
7. సమస్య - స్పందన
8. విలువలు
కవి పరిచయాలు:
వార్త, విజేత, ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్, భావ తరంగిణి, సాక్షి, ఆంధ్ర జ్యోతి, విశాలాంధ్ర లలో ప్రచురింపబడ్డాయి
సమాజ సేవ:
సృజనా మహిళా మండలి అధ్యక్షురాలు, మార్కాపురం.
ఆశ్రిత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షురాలు.తణుకు.
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం,తణుకు అధ్యక్షురాలు
పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబరు, ఏలూరు
జిల్లా గ్రంధాలయం ఎగ్జిక్యూటివ్ మెంబరు, పెనుగొండ
జిల్లా గ్రంధాలయం,మహిళాప్రతినిధి, తణుకు
మరచిపోలేని అనుభూతులు:
1. 'మంచి వ్యక్తిత్వం మనిషికి ఉండాలి ' వ్యాసం చదివి ఆరేండ్లుగా మాట్లాడుకోని తండ్రీ కొడుకులు కలవటం
2. ' ఫ్యామిలీ ఒక పూలతోట ' వ్యాసం చదివి 'ఈవిడ కౌన్సిలింగ్ ఇస్తే ఏ జంటా విడాకులు తీసుకోదు ' అని విజయవాడ లోని ఓ జడ్జిగారి ప్రశంస
3. ' మనిషి - మనిషి ' వ్యాసం చదివి ఆరేండ్లుగా విడాకులు తీసుకుంటామని చెబుతున్న ఓ జంట ' మేము విడిపోము, కలిసే ఉంటాము ' అని చెప్పటము.
4.యువతా నీ పయనం ఎటు ?అనే వ్యాసం చదివి ఓ యువకుడు రహస్యం గా తన స్నేహితుడికి చేస్తున్న పెళ్లిని ఆపటమే గాక ఇద్దరూకూడా తల్లి తండ్రులకు చెప్పి,ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంటామని నిర్ణయించుకున్నా రు.
5. ‘సర్దుకుపొండి’అనే అనుబంధపుస్తకం చదివి స్నేహితులు లేని తనకు చుట్టుప్రక్కల అందరూ స్నేహితులుఅయ్యారని ,ఎప్పుడూ కొట్టుకునే అత్తా కోడళ్ళు కూడా కొట్టుకోవటం మానేసారని ,అదంతా మీ పుస్తకం చదివించటం వలెనే జరిగిందని ఓ అభిమాని ఆనందంగా చెప్పటం .
సాహిత్య ప్రేరణ:
1. ప్రకృతి, కాసా గార్డెన్స్, శ్రీ కాళహస్తి లో బాల్యం రుచి చూడటం
2. ఆడపిల్లననే భావన రానీయక ప్రతి అంశాన్ని పరిశీలించే సహకారాన్ని అందించిన తల్లితండ్రులు
సాధించినవి:
దేశ విదేశాలలో అభిమానులు
లక్ష్యాలు :
సామాజిక స్పృహ ఉన్న రచనలు చేయటం
సమాజంలో ఉన్న వ్యక్తులలో మార్పుకై కృషి చేయటం
స్త్రీలల్లో చైతన్యం తీసుకురావటం
నవలా రచయిత్రిగా స్థిరపడటం
గీత రచయితగా వెలుగొందటం
అలవాట్లు:
చదవటం, వ్రాయటం, సభా కార్యక్రమాలలో పాల్గొనటం
అభిమానుల సమస్యలను పరిష్కరించటం
ఉద్యోగ అనుభవం:
విజయవాడలోని శ్రీ తేలప్రోలు రాజా ఇంగ్లీషు మీడియం హైస్కూలులో ఆరేండ్లు టీచరుగా అనుభవం .
జీవిత భాగస్వామి:
శ్రీ యలమర్తి శ్రీ రామ చంద్ర వర ప్రసాద రావు, బి.కాం
జీవితంలోనే కాక సాహిత్యంలో కూడా సగ భాగమై ప్రోత్సాహాన్ని అందించే శ్రీవారు దొరకటం .
పిల్లలు:
యలమర్తి అన్వేష్. బి..టెక్., సాఫ్ట్ వేర్ ఇంజనీర్.క్వాల్కం
యలమర్తి మానస లక్ష్మి, బి.టెక్ (III. year) గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్, హైద్రాబాదు.
చిరునామా:
యలమర్తి అనూరాధ,
తణుకు - 534 211
పశ్చిమ గోదావరి జిల్లా.
Email ID : anuradha.yalamarthy@gmail.com
ఇ మెయిల్ ఐ డి : అనురాధ.యలమర్తి@జిమెయిల్.కాం
5, ఏప్రిల్ 2016, మంగళవారం
మంచి భర్త ఎలా ఉండాలంటే ..
3, ఏప్రిల్ 2016, ఆదివారం
2, ఏప్రిల్ 2016, శనివారం
నేను నా బ్లాగ్ - స్వాగత సుమాంజలి
బ్లాగ్ మిత్రులకి నమస్కారం .
నా పేరు అనూరాధ యలమర్తి .
నా పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ ! అవునండీ ... నేను రచయితని .
నా రచనలన్నీ ఈ బ్లాగ్ ద్వారా పరిచయం చేసుకోవాలని నా కోరిక . అందుకే వచ్చానిలా !
తెలుగు బ్లాగులు గురించి మిత్రులు చెప్పగా చాలా విన్నాను . ఇదిగో ఇప్పుడిలా వచ్చాను .
నాకు బ్లాగ్ వ్రాయడం కొత్త కదా ! మీరందరూ నాకు తెలియని విషయాలు చెపుతారని ఆశిస్తూ ...
అనూరాధ యలమర్తి .
నా పేరు అనూరాధ యలమర్తి .
నా పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ ! అవునండీ ... నేను రచయితని .
నా రచనలన్నీ ఈ బ్లాగ్ ద్వారా పరిచయం చేసుకోవాలని నా కోరిక . అందుకే వచ్చానిలా !
తెలుగు బ్లాగులు గురించి మిత్రులు చెప్పగా చాలా విన్నాను . ఇదిగో ఇప్పుడిలా వచ్చాను .
నాకు బ్లాగ్ వ్రాయడం కొత్త కదా ! మీరందరూ నాకు తెలియని విషయాలు చెపుతారని ఆశిస్తూ ...
అనూరాధ యలమర్తి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)